అర్ధరాత్రి ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పోలీసులు సోదాలు

అర్ధరాత్రి ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పోలీసులు సోదాలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు  రాజకీయ నేతల ఇళ్లలో, వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.  నవంబర్ 28 అర్ధరాత్రి నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఫిరోజ్ ఖాన్ ఇంట్లో భారీ నగదు ఉందన్న సమాచారంతో అర్థరాత్రి ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులకు ఫిరోజ్ ఖాన్ సహకరించారు. పోలీసుల సోదాల నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకటించినప్పటి నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు రాజకీయ నేతల వాహనాలను కూడా సోదాలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని పాతబస్తీలోని ఫలక్‌నుమాలో ఉన్న కింగ్స్‌ గార్డెన్‌ యజమాని షానవాజ్‌ నివాసంలో ఇటీవల ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. కాగా, తెలంగాణలో రేపు పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.