- మంచిర్యాలలో సర్పంచులకు 518... వార్డు మెంబర్లకు 1,749 నామినేషన్లు
- ఆదిలాబాద్ లో 166 పంచాయతీలకు 756 నామినేషన్లు
- ముగిసిన మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ
- అత్యధికంగా ఉట్నూర్ మండలంలో 185 నామినేషన్లు
మంచిర్యాల, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం చివరి రోజైన శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఫస్ట్ ఫేస్ లో మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్, లక్షేట్టిపేట్, దండేపల్లి, జన్నారం మండలాల్లో 90 పంచాయతీలు, 816 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈనెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించగా, సర్పంచ్ స్థానాలకు 518, వార్డు మెంబర్లకు 1,749 నామినేషన్లు వచ్చాయి.
ఆదిలాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లోమొదటి ఘట్టం పూర్తైంది. శనివారం రాత్రి వరకు కొనసాగిన మొదటి విడత సర్పంచ్ నామినేషన్ల స్వీకరణలో మొత్తం 166 గ్రామ పంచాయతీలకు గాను 756 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా ఉట్నూర్ మండలంలో 185 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత అభ్యర్థుల నామినేషన్ల విత్ డ్రా డిసెంబర్ 3తో ముగియనుంది. ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 2వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా...
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డులు నామినేషన్లు
జైనూర్ 26 124 222 314
కెరమెరి 31 156 250 383
లింగాపూర్ 14 79 112 163
సిర్పూర్(యు) 15 56 124 159
వాంకిడి 28 106 236 407
మొత్తం 114 521 944 1,426
మంచిర్యాల జిల్లా...
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డులు నామినేషన్లు
దండేపల్లి 31 171 278 576
హాజీపూర్ 12 74 106 245
జన్నారం 29 170 272 543
లక్సెట్టిపేట 18 103 160 385
మొత్తం 90 518 816 1,749
