మునుగోడు మండలంలోని కస్తూర్బా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యార్థిని మిస్సింగ్

మునుగోడు మండలంలోని కస్తూర్బా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యార్థిని మిస్సింగ్

మునుగోడు, వెలుగు: మునుగోడు మండలంలోని కస్తూర్బా పాఠశాల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మిస్సయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 7న అస్వస్థతతో ఇంటికెళ్లిన ఆమెను కుటుంబ సభ్యులు నవంబర్ 30న తిరిగి పాఠశాలకు పంపారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆమె ఏకాంతంగా గడిపింది.  

భోజన సమయానికి కనిపించకపోవడంతో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఛార్జి ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పాఠశాలను సందర్శించి విద్యార్థిని వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓను సస్పెండ్ చేసి, డ్యూటీలో ఉన్న టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు తెలిసింది. విద్యార్థిని కోసం గాలింపు చర్యలను పోలీసులు వేగవంతం చేశారు.