విమెన్స్​ కోచ్‌‌‌‌ రేస్‌‌‌‌లో ఐదుగురు మహిళలు

విమెన్స్​ కోచ్‌‌‌‌ రేస్‌‌‌‌లో ఐదుగురు మహిళలు

టీమిండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ పదవికి పోటీ భారీగా పెరిగింది. మాజీ చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌ హేమలత కాలా సహా ఐదుగురు మాజీ మహిళా క్రికెటర్లు రేసులో ఉన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు ఈ పదవిలో మెన్స్‌‌‌‌ మాత్రమే పని చేయగా, ఇప్పుడు మహిళా క్రికెటర్లు కూడా రేస్‌‌‌‌లోకి వచ్చేశారు. మమతా మాబెన్‌‌‌‌, జయా శర్మ, సుమన్‌‌‌‌ శర్మ, నూషిన్‌‌‌‌ అల్‌‌‌‌ ఖాదిర్‌‌‌‌... ఈ జాబితాలో ఉన్నారు. వీళ్లతో పాటు మాజీ కోచ్‌‌‌‌ డబ్ల్యూ వీ రామన్‌‌‌‌ కూడా ఈ పదవికి మళ్లీ అప్లై చేశాడు. మాజీ కోచ్‌‌‌‌లు రమేశ్‌‌‌‌ పొవార్‌‌‌‌, తుషార్‌‌‌‌ అరోతే కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మదన్‌‌‌‌లాల్‌‌‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ).. వీళ్లలో నుంచి ఒకర్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌‌‌‌లో జరిగే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ వరకు.. కొత్త కోచ్‌‌‌‌తో కలిసి తాము విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు చాలా వర్క్‌‌‌‌ చేయాల్సి ఉందని సెలెక్షన్‌‌‌‌ కమిటీ హెడ్‌‌‌‌ నీతూ డేవిడ్‌‌‌‌ వెల్లడించింది. ‘ఇంటర్వ్యూ డేట్స్‌‌‌‌ను బీసీసీఐ ఇంకా అనౌన్స్‌‌‌‌ చేయలేదు. డేట్స్‌‌‌‌ వచ్చాకా మేం బెస్ట్‌‌‌‌ కాండిడేట్‌‌‌‌ను ఎంపిక చేస్తాం. మేల్‌‌‌‌, ఫిమేల్‌‌‌‌ ఎవరైనా సరే. మా ప్రయారిటీస్‌‌‌‌కు సరిపోతే కచ్చితంగా చాన్స్‌‌‌‌ ఇస్తాం’ అని నీతూ పేర్కొంది.