- 20 గేట్లు ఓపెన్
- బ్యారేజీపై వాహనాలరాకపోకలు బంద్
గోదావరిఖని, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తీవ్రంగా పెరగడంతో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు 5 గేట్లను ఎత్తి 13,650 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదిలారు. అప్పటి నుంచి గంటగంటకు నీటి విడుదలను పెంచుతూ వచ్చారు.
ఆరు గంటలకు 35 వేల క్యూసెక్కులు, ఏడు గంటలకు 65 వేల క్యూసెక్కుల నీటిని వదలగా 16 గేట్లు ఓపెన్ చేశారు. ఉదయం 7.30 గంటల సమయంలో 20 గేట్లు ఓపెన్ చేసి 1,07,500 క్యూసెక్కులు, 9.30 గంటలకు 1,36,714 క్యూసెక్కులు, మధ్యాహ్నం 12 గంటలకు 1,36,092 క్యూసెక్కులు, 2 గంటలకు 1,45,104 క్యూసెక్కులు, సాయంత్రం 6 గంటలకు 1,44,714 క్యూసెక్కుల నీటిని వదిలారు.