మహిళలకు నెలకు 5 వేలు

మహిళలకు నెలకు 5 వేలు
  • నేరుగా బ్యాంకులో జమ చేస్తం
  • గోవాలో టీఎంసీ ఎన్నికల హామీ

పనాజీ: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గోవాలో కూడా అధికారంలోకి రావాలని తృణమూల్‌‌ కాంగ్రెస్(టీఎంసీ) ప్లాన్ చేస్తోంది. అందుకోసం మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని 3.5 లక్షల కుటుంబాల్లోని మహిళలకు నెలకు రూ.5,000 ఇస్తామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన గృహలక్ష్మి పథకాన్ని శనివారం లాంచ్ చేసింది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డులో ఇంటిపెద్దగా పేరున్న ప్రతి మహిళకు నెలకు రూ.5 వేలు చొప్పున సంవత్సరానికి రూ.60 వేలు నేరుగా అకౌంట్లలో వేస్తామని టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్రి శనివారం ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన కార్డులను త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. గోవాలో అధికారంలోకి వచ్చిన వెంటనే కార్డుపై ఉన్న యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆధారంగా డబ్బులు అకౌంట్‌‌లో వేస్తామని చెప్పారు. గోవాలో గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్లు ఖర్చవుతుందని టీఎంసీ అంచనా వేస్తోంది.