టూల్స్ అండ్ గాడ్జెట్స్.. మినీ షేవర్​

టూల్స్ అండ్ గాడ్జెట్స్..  మినీ షేవర్​

షాపింగ్​కి వెళ్లేటప్పుడు క్రెడిట్​ కార్డులు తీసుకెళ్లడం మర్చిపోతున్నారా? అలాంటప్పుడు వాటిని మొబైల్​కే ఎటాచ్​ చేసుకోవచ్చు కదా!  బిజినెస్​ పనుల మీద ఊర్లు తిరిగేటప్పుడు షేవింగ్​ కిట్​ వెంట తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉందా?  అలాంటప్పుడు ఈ మినీ షేవర్​ని జేబులో వేసుకుని వెళ్తే.. సరిపోతుంది.  ఇవేకాదు.. 
మరికొన్ని ఇంట్రెస్టింగ్​ టూల్స్ అండ్​ గాడ్జెట్స్​ వివరాలు.. 

వీ మ్యాగ్​

కొందరికి ఎప్పుడూ వ్యాలెట్​ వెంట తీసుకెళ్లడం ఇష్టం ఉండదు. అలాంటివాళ్లు ఏటీఎం కార్డులు క్యారీ చేయడానికి ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లకు  ఈ వీ మ్యాగ్​ బెస్ట్​ టూల్​. ఇది చిన్న సైజులో ఉండే క్రెడిట్​ కార్డ్​ హోల్డర్​. దీన్ని జేబులో పెట్టుకోవచ్చు. లేదంటే ఫోన్​కి వెనుక భాగంలో ఎటాచ్ చేసుకోవచ్చు. దీన్ని అల్యూమినియంతో తయారుచేశారు. చాలా స్ట్రాంగ్​గా ఉంటుంది.  దీని నుంచి కార్డ్స్​ని ఈజీగా బయటికి తీయొచ్చు. అంతేకాదు.. దీన్ని మొబైల్​కి ఎటాచ్​ చేసుకుంటే.. మొబైల్​ హోల్డర్​గా పనిచేస్తుంది. దీనికి ఉండే టూల్​ స్క్రూ డ్రైవర్​లా పనిచేస్తుంది. ఇందులో చిన్న సైజు నైఫ్​, బాటిల్​ క్యాప్​ ఓపెనర్​ కూడా ఉన్నాయి. 

ధర: సుమారు 4,000 రూపాయలు

మౌస్​ రిస్ట్​ సపోర్ట్​ 

ఎప్పుడూ కంప్యూటర్​ ముందు కూర్చుని పనిచేస్తుండే వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటివాళ్లలో కొందరు పదే పదే మౌస్​ కదిలిస్తుండడం వల్ల మణికట్టు భాగంలో నొప్పి వస్తుంటుంది. అందుకే రిస్ట్ స్టెయిన్​ కాకుండా ఉండేందుకు సపోర్టర్​ని వాడితే సరిపోతుంది. మౌస్‌‌‌‌ రిస్ట్ సపోర్టర్లను చాలా కంపెనీలు మార్కెట్​లోకి తీసుకొచ్చాయి. క్వాలిటీని బట్టి ధర ఉంటుంది.  

ధర: 600 నుంచి 1500 రూపాయలు

కీ హోల్డర్​ 

చాలామంది ఒకటి కంటే ఎక్కువ తాళం చెవులను క్యారీ చేస్తుంటారు. అలాంటివాళ్లకు ఈ షీల్డ్​ఎక్స్​ బాగా పనికొస్తుంది. ఇది చూడ్డానికి చిన్న గాడ్జెట్​లా ఉంటుంది. దీనికి కీలని ఎటాచ్​ చేసి పెట్టుకుంటే సరిపోతుంది.  8 నుంచి 10 తాళం చెవులను ఎటాచ్​ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఏరోస్పేస్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్​తో తయారు చేస్తారు. కంపార్ట్‌‌‌‌మెంట్ చాలా కాంపాక్ట్​గా ఉంటుంది. కీస్​ని ఫ్లిక్ మోషన్‌‌‌‌తో యాక్సెస్ చేయొచ్చు. దీనికి కీలను ఎటాచ్​ చేయడం కూడా చాలా ఈజీ.

ధర: సుమారు 2,000 రూపాయలు

ఎన్​చెన్​

బిజినెస్​ ట్రిప్పులు, మీటింగ్​లు.. అంటూ ఎప్పుడూ ట్రావెల్​ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. వాళ్లు ఎప్పుడూ ఎక్కువ లగేజీ క్యారీ చేయడం కుదరకపోవచ్చు. అలాంటివాళ్ల కోసం మార్కెట్​లో మినీ ట్రావెలర్​ ఎలక్ట్రిక్​ షేవర్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్​చెన్​ కంపెనీ తీసుకొచ్చిన ఈ షేవర్​ని​ ఫుల్​ ఛార్జ్​ చేయడానికి 60 నిమిషాలు పడుతుంది. తిరిగి 60 నిమిషాల వరకు వాడుకోవచ్చు. ఇది చాలా చిన్నగా ఉంటుంది. జేబులో పెట్టుకుని కూడా ట్రావెల్​ చేయొచ్చు. ఇది సీల్డ్​ బాడీతో వస్తుంది. కాబట్టి నేరుగా ట్యాప్​ కింద కడిగి క్లీన్​ చేసుకోవచ్చు. ఇందులో చాలా షార్ప్​గా ఉండే క్లోవర్ బ్లేడ్ ఉంటుంది. ​హైస్పీడ్​ మోటారుతో పనిచేస్తుంది. 

ధర: 699 రూపాయలు