సిరాజ్ చిన్నప్పుడెలా ఉన్నాడో చూడండి: వీవీఎస్ లక్ష్మణ్

సిరాజ్ చిన్నప్పుడెలా ఉన్నాడో చూడండి: వీవీఎస్ లక్ష్మణ్
  • మాజీ క్రికెటర్ వీవీఎస్  లక్ష్మణ్

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో కీలక బౌలర్ గా ఎదుగుతున్న హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ తనను చిన్నప్పుడే కలిశాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. సిరాజ్ చిన్నప్పుడే తనను కలసిన నాటి ఫోటోను లక్ష్మణ్ షేర్ చేశాడు. ఇంగ్లండ్‌లోని చారిత్రకమైన లార్డ్స్ మైదానంలో ఆదేశ జట్టుతో  జరిగిన రెండో టెస్టులో  మహ్మద్ సిరాజ్ 8 వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. సిరాజ్ అపూర్వ ప్రదర్శనకు మేటి క్రికెటర్లంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మరో హైదరాబాదీ, వెటరన్, భారత మాజీ  క్రికెటర్‌ వివిఎస్ లక్ష్మణ్ మహమ్మద్ సిరాజ్ 10ఏళ్ల లోపు చిన్నారిగా ఉన్నప్పటి సమయంలోని ఫోటోను  షేర్‌ చేశాడు. క్రికెట్‌లో మహమ్మద్ సిరాజ్‌ ప్రదర్శను చూసి గర్విస్తున్నానని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెటర్ గా సిరాజ్ క్రీడా ప్రయాణం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోందని, ఇక ముందు కూడా సిరాజ్ తన కేరీర్‌లో మరింత  రాణించాలని  ఆకాక్షించాడు లక్ష్మణ్. 
ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో సిరాజ్ మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు, రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు చొప్పున మొత్తం 8 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ అపూర్వ ప్రదర్శనతో ఐసీసీ  ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని  ఎంతగానో మెరుగుపరుచుకున్నాడు. అంతర్జాతీయంగా తన ర్యాంకును ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు.