ఏసీబీ కస్టడీలో మాజీ ఏడీఈ అంబేద్కర్

ఏసీబీ కస్టడీలో  మాజీ ఏడీఈ అంబేద్కర్

హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మణికొండ ఎలక్ట్రిసిటీ మాజీ ఏడీఈ (అసిస్టెంట్‌‌ డివిజనల్‌‌ ఇంజనీర్‌‌) అంబేద్కర్‌‌ ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. సోమవారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఆయన్ను విచారించింది. 4 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు కీలక వివరాలు సేకరించారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఎక్కడెక్కడ.. విధులు నిర్వహించారనే వివరాలు రాబట్టారు. 

ఆయన పేరుతో ఉన్న ఆస్తులు, లావాదేవీల గురించి ఆరా తీశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో సెప్టెంబర్ 16న అంబేద్కర్ ఇండ్లు, బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా బినామీల పేర్లతో ఉన్న ఆస్తులపై ప్రశ్నించినట్లు తెలిసింది. రెండో రోజు కస్టడీలో భాగంగా మంగళవారం ప్రశ్నించనున్నారు.