భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే 95 ఏళ్ల కుంజా బొజ్జి ఇవాళ(సోమవారం) ఉదయం తుది శ్వాస విడిచారు. 95 ఏళ్ల ఆయన శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ కన్ను మూశారు. 

కుంజా బొజ్జి భద్రాచలం అసెంబ్లీ నియోజకర్గం నుంచి వరుసగా 1985,1989,1994 సార్లు సీపీఎం తరుపున పోటి చేసి గెలుపొందారు. కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కుంజా బొజ్జిని బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత బొజ్జి ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పోందుతూ సోమవారం ఆయన కన్నుమూశారు.

కుంజా బొజ్జిది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం అడవి వెంకన్న గూడెం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన ఆయన చిన్నప్పుడే సీపీఎం సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరఫున పలు పోరాటాలు చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్నా సైకిల్‌ పైనే కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్‌ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు.ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతరులకు ఎన్నో సేవలందించారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సొంత ఇల్లు కూడా లేని ఎమ్మెల్యే. నిస్వార్థంగా ప్రజలకు సేవలందించారు. ఆయన భార్య లాలమ్మ 2018లో  అనారోగ్యంతో చనిపోయారు. బొజ్జికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుంజా బొజ్జి మృతికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.