త్వరలో క్రెడిట్​ కార్డ్​ పోర్టింగ్.. నచ్చిన నెట్​వర్క్​కు మారొచ్చు

త్వరలో క్రెడిట్​ కార్డ్​ పోర్టింగ్.. నచ్చిన నెట్​వర్క్​కు మారొచ్చు
  • డెబిట్​ కార్డులకూ వర్తింపు
  • అక్టోబరు నుంచి అమలు

న్యూఢిల్లీ: టెలికం నెట్​వర్క్​ను పోర్ట్ ​చేసుకున్నట్టే ఇక నుంచి డెబిట్​, క్రెడిట్, ప్రీపెయిడ్​ కార్డులను కూడా మార్చుకునే సదుపాయం రాబోతోంది. మాస్టర్​కార్డ్​ నుంచి రూపే లేదా ఏదైనా నెట్​వర్క్​కు కార్డులను మార్చుకోవడానికి ఆర్​బీఐ ఒక సర్కులర్​ను​ కూడా జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంకులే నెట్​వర్క్​ను ఎంపిక చేసి కార్డులను ఇస్తున్నాయి. అక్టోబరు నుంచి కార్డ్​ పోర్టబిలిటీ అందుబాటులోకి రానుంది. అప్పటి నుంచి కార్డు నెట్​వర్క్​ను మార్చుకున్నప్పటికీ దాని నంబరు, బ్యాలెన్స్​, ఖాతాలు, హిస్టరీ వంటి వివరాలేవీ మారవు.  అమెరికన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్‌‌‌‌  ఇంటర్నేషనల్ లిమిటెడ్, మాస్టర్ కార్డ్ ఆసియా/ పసిఫిక్  ప్రైవేట్​ లిమిటెడ్​, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్,- రూపే,  వీసా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైడ్ భారతదేశంలో ఆథరైజ్డ్‌‌‌‌​ కార్డ్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు. మనం కొత్తగా  దరఖాస్తు చేసుకున్నప్పుడు వీటిలో ఏదో ఒక నెట్​వర్క్​తో కార్డును జారీ చేస్తారు.

ఈ నెట్​వర్క్​ను బ్యాంకు/కార్డ్​ఇష్యూయరేఎంపిక చేస్తారు. ఇక నుంచి నెట్​వర్క్​ను మార్చుకునేందుకు కస్టమర్లకు అవకాశం ఇవ్వాలని ఆర్​బీఐ ఈ నెల ఐదున జారీ చేసిన సర్క్యూలర్​లో బ్యాంకులను, ఫైనాన్స్​ కంపెనీలను ఆదేశించింది. కార్డు తీసుకునేటప్పుడు లేదా తరువాత కూడా నెట్​వర్క్​ను మార్చుకునే సదుపాయాన్ని కల్పించాలని స్పష్టం చేసింది. దీనివల్ల కార్డుల వాడకం మరింత సురక్షితంగా మారుతుందని, క్రెడిట్​ను మేనేజ్​చేయడం సులువు అవుతుందని ఆర్​బీఐ తెలిపింది. అంతేగాక ఎక్కువ సేవలు, రికార్డులు, బెనిఫిట్స్​ అందించే నెట్​వర్క్​లకు మారడానికి వీలుంటుంది. కస్టమర్​ సర్వీసు కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఒకే కార్డు నెట్​వర్క్​కు పరిమితం అయ్యేలా ఒప్పందాలు చేసుకోవద్దని ఇష్యూయర్లకు సూచించింది. 

పోర్టింగ్​ ఎందుకంటే...

కార్డ్​ పోర్టింగ్​ వల్ల కంపెనీల మధ్య పోటీ పెరుగుతుంది. మరింత సమర్థంగా సేవలు అందుతాయి. కస్టమర్​ తన అవసరాలకు తగిన కార్డును ఎంచుకోవచ్చు. కొన్ని నెట్​వర్కుల్లో ఫీచర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు రూపే నెట్​వర్క్​ కార్డును తీసుకుంటే దాని ద్వారా యూపీఐ ద్వారా కూడా డబ్బులు చెల్లించవచ్చు. ఇతర ఏ నెట్​వర్క్​లోనూ ఈ సదుపాయం లేదు. కస్టమర్​ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కార్డ్​ నెట్​వర్క్​ను మార్చుకునే విధానాన్ని తీసుకురావడం బాగుందని బ్యాంక్​బజార్​ సీఈఓ అదిల్​ శెట్టి అన్నారు. పోర్టబిలిటీ అందుబాటులోకి వస్తే ఎక్కువ మంది యూజర్లు యూపీఐ సదుపాయం ఉన్న నెట్​వర్క్​కు మారతారని ఈవై ఇండియా సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ రణ్​దుర్జయ్​ తాలూద్కర్​ అన్నారు.

కొత్త కార్డులు తీసుకునేవాళ్లు కూడా రూపే కార్డుల వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉంటాయని చెప్పారు. కార్డ్​ పోర్టబిలిటీని అక్టోబరు నుంచి అమలు చేయాలని డెడ్​లైన్​ విధించడం వల్ల బ్యాంకులకు ఇబ్బందులు ఉంటాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. కొత్త విధానాన్ని అందుబాటులోకి తేవడానికి వాటికి కేవలం 90 రోజులే గడువు ఉందని అంటున్నారు. ఇంత తక్కువ సమయంలో పోర్టింగ్​తేవడం కొద్దిగా కష్టమవుతుందని చెబుతున్నారు. అంతేగాక బ్యాంకులు ఇది వరకే నెట్​వర్క్​లతో కుదుర్చుకున్న ఒప్పందాలను పక్కనబెట్టాల్సి ఉంటుంది. అయితే కార్డ్​ పోర్టబిలిటీపై అభిప్రాయాలను తెలియజేయడానికి ఆర్​బీఐ బ్యాంకులకు, ఇతర స్టేక్​హోల్డర్లకు వచ్చే నెల నాలుగో తేదీ వరకు గడువు ఇచ్చింది.