రెచ్చగొడ్తున్నది పాకిస్తానే..భారత్​పై కుట్రలు చేస్తుంది

రెచ్చగొడ్తున్నది పాకిస్తానే..భారత్​పై కుట్రలు చేస్తుంది
  • భారత విదేశాంగ కార్యదర్శివిక్రమ్ మిస్రీ ఫైర్​
  • పరిస్థితిని తీవ్రం చేయడంతో..మేం స్పందించాం
  • టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూ.. భారత్​పై కుట్రలు చేస్తున్నది
  • ఉద్రిక్తతలను పెంచితే తగిన రీతిలో జవాబిస్తామని వార్నింగ్
  • వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషితో కలిసి ప్రెస్​మీట్

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్​ మధ్య టెన్షన్లు పెరిగేందుకు పాక్ అనుసరిస్తున్న టెర్రరిస్టు అనుకూల విధానాలే ప్రధాన కారణమని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఆ దేశం టెర్రరిస్టులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తున్నదని, అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. భారత్ ఎలాంటి టెన్షన్లు పెంచాలని కోరుకోవడం లేదని, అయితే పాకిస్తాన్ ఉద్రిక్తతను పెంచితే తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు. గురువారం ఆయన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషితో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్​సిందూర్​లో టెర్రరిస్టుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టినట్టు తెలిపారు. పాక్ ప్రజల, మిలటరీ ఆవాసాలు, భవనాలను టార్గెట్​గా చేసుకోలేదని చెప్పారు. పహల్గాం దాడి జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెరుగవుతున్న సాధారణ పరిస్థితులను దెబ్బతీసే కుట్రతో జరిగిందన్నారు. అక్కడి పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని వివరించారు. ఈ దాడి భారత్​లోని వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే దురుద్దేశంతో జరిగిందన్నారు. అయితే భారత ప్రభుత్వం, ప్రజలు వారి కుట్రలను విఫలం చేశారని తెలిపారు.

పాక్ టీఆర్​ఎఫ్​ను కాపాడుతున్నది

‘ఆపరేషన్ సిందూర్’లో ఇండియా సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు రక్షణ శాఖ వెల్లడించిందని మిస్త్రీ తెలిపారు. ఈ దాడులు టెర్రరిస్టులు ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను ధ్వంసం చేయడానికి, భవిష్యత్తులో భారత్​పై దాడులను అరికట్టేందుకు చేసినట్లు వివరించారు. భారత్​ చేసిన ఎటాక్​ పూర్తిగా టెర్రరిస్టుల క్యాంపులపైనే జరిగిందనని,  పాక్ సైనిక, పౌర స్థలాలపై జరగలేదని పేర్కొన్నారు. తమ దాడుల్లో పౌరులు మరణించారని పాక్​ చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆ దేశం టెర్రరిస్టులకు అండగా నిలుస్తున్నదని ఆరోపించారు. ‘‘26/11 ముంబై దాడుల నిందితుడు సాజిద్ మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలుత మృతుడని ప్రకటించిది. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడితో అరెస్టు చేసింది”అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పహల్గామ్​దుర్ఘటనకు కారణమైన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ది రెసిస్టెంట్​ఫోర్స్)​ను రక్షించేందుకు పాక్ ఐక్యరాజ్య సమితి(యూఎన్)​పై ఒత్తిడి తెచ్చిందని విమర్శించారు. 

15 లక్ష్యాలపై దాడికి పాక్ ​ప్రయత్నం

ఆపరేషన్​సిందూర్​కు ప్రతిగా గురువారం భారత్ లోని 15 సైనిక లక్ష్యాలపై పాకిస్థాన్ దాడి చేయడానికి ప్రయత్నించింది. దీనికి ప్రతిస్పందనగా ఇండియా లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎయిర్​డిఫెన్స్, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. మరోవైపు సిక్కులు టార్గెట్​గా పాక్ దాడులు చేస్తున్నది. జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రం పూంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గురుద్వారాపై పాక్ ​జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఇండియా తమ మతపరమైన ప్రదేశాలు లక్ష్యంగా దాడులు చేసిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపణలు చేసింది. మరోవైపు నియంత్రణ రేఖ(ఎల్​వోసీ) వెంట ఉన్న పూంచ్​లోని ఒక గురుద్వారాపై పాకిస్తాన్ షెల్లింగ్ చేసి ధ్వంసం చేసింది. ఇందులో 16 మంది చనిపోగా 59 మంది గాయపడ్డారు.