రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ చిత్రం నుంచి చరణ్ కొత్త పోస్టర్‌తో పాటు సాంగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ నెలలో రెండో పాటను రిలీజ్ చేయనున్నట్టు తెలియజేస్తూ విడుదల చేసిన చరణ్ పోస్టర్ మెస్మరైజ్ చేస్తుంది.
పెద్ద జాతర మధ్యలో తలకు రెడ్ టవల్ చుట్టుకుని రోడ్డుపై స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు చరణ్. దీన్ని బట్టి మాస్ బీట్‌తో ఈ సెకండ్ సింగిల్ రాబోతోందని అర్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్‌డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. అందులో ఒకటి ఐఎఎస్‌ఆఫీసర్‌పాత్ర కాగా, మరొకటి ప్లాష్‌బ్యాక్ సీన్స్‌లో వచ్చే పొలిటీషియన్ పాత్ర అని తెలుస్తోంది. ఎస్ జే సూర్య, జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.