
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో శుక్రవారం వినాయక నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు శుక్రవారం మండపాల నుంచి శోభాయాత్రగా బయలుదేరారు. డప్పుచప్పుళ్లు, కోలాట నృత్యాలు, డీజే పాటలతో హోరెత్తించారు. నిమజ్జన ర్యాలీల్లో యూత్ స్టెప్పులు వేశారు. చెరువులు, కుంటల వద్ద వాహనాలతో క్యూలో ఉంటూ గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు.
పోలీసుల భారీ బందోబస్తు, అధికారుల ఏర్పాట్లతో మొత్తంగా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ వరంగల్లో వినాయక నిమజ్జనాలు కలర్‍ఫుల్‍గా కనిపించాయి. ట్రైసిటీ రోడ్లపై జిగేల్‍మనే లైటింగ్ ఉండటంతో శోభాయాత్ర సందడిగా మారింది. నిమజ్జన కార్యక్రమం శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.- వరంగల్, వెలుగు