బెంగాల్లో గంగాసాగర్ మేళా ప్రారంభం

బెంగాల్లో గంగాసాగర్ మేళా ప్రారంభం
  • కోవిడ్ రూల్స్ మధ్య భక్తుల పుణ్య స్నానాలు
  • తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద మేళా

కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగాసాగర్ మేళా ప్రారంభమైంది. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గంగాసాగర్ దగ్గర గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడే గంగాసాగర్ పేరుతో మేళా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు, ఉత్తరాదిలో కుభమేళా మాదిరిగానే గంగాసాగర్ మేళా కూడా పెద్ద ఉత్సవం. మొత్తం తూర్పు భారతంలో ఇదే అతిపెద్ద మేళా. లక్షల సంఖ్యలో జనం వచ్చి అక్కడ పుణ్యస్నానాలు చేస్తారు. అయితే కరోనా కారణంగా కఠిన ఆంక్షల మధ్య ఈసారి గంగాసాగర్ మేళా జరుగుతోంది. పోలీసులు, నేవీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ లను గంగాసాగర్ లో మోహరించారు. వచ్చే భక్తులు, సాధువులకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులోనూ 50 శాతం ప్రయాణికులనే అనుమతిస్తున్నారు.