గ్యాస్ పైప్ డ్యామేజ్ అయితే టేప్ చుట్టిన్రు.. వంట చేస్తుండగా మంటలు

గ్యాస్ పైప్ డ్యామేజ్ అయితే టేప్ చుట్టిన్రు.. వంట చేస్తుండగా మంటలు
  •  ఒకరికి స్వల్ప గాయాలు

శంషాబాద్, వెలుగు: గ్యాస్​సిలిండర్​రెగ్యులేటర్​పైప్​డ్యామేజ్​అయింది. అయినా దాన్ని మార్చకుండా స్టిక్కర్​వేసి, వాడుకుంటున్నారు.. వంట చేస్తుండగా గ్యాస్​లీకై, అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వాటిని ఆర్పేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధి పద్మశాలీపురం టీఎన్జీవోస్ సొసైటీ సాయి కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి కాలనీ ఫ్లాట్​నంబర్​871లో ఉంటున్న చెన్నమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో వంట చేస్తోంది. 

సిలిండర్ పైప్​లీకై, ఒక్కసారిగా మంటలు రావడంతో ఆమె కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది. స్థానికుడైన బాలరాజు ఓ సంచిని నీటిలో తడిపి, ఆ సిలిండర్ కు చుట్టి బయటకు తీసుకువచ్చి, మంటలు ఆర్పివేశాడు. ఈ ప్రయత్నంలో అతను స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్​సిబ్బంది ఇంట్లో కిటికీలు, టీవీ, ఇతర సామగ్రికి అంటుకున్న మంటలను ఆర్పారు. రెగ్యులేటర్ పైప్ డ్యామేజ్​అయినా మార్చకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.