శ్రీశైలం జలాశయంలో తెప్పల్లోనే కొట్టుకున్న మత్స్యకారులు : సినిమా సీన్ చూపించిన కుర్రోళ్లు

 శ్రీశైలం జలాశయంలో తెప్పల్లోనే కొట్టుకున్న మత్స్యకారులు : సినిమా సీన్ చూపించిన కుర్రోళ్లు

శ్రీశైలం జాలాశయం.. వరద నీళ్లు రావటంతో చేపల వేట షురూ చేశారు మత్స్యకారులు. అందరూ కుర్రోళ్లే. తెప్పలపై చేపల వేట చేస్తున్న వీళ్ల మధ్య మాటమాట పెరిగింది. ఇది కాస్తా కొట్లాటకు దారి తీసింది. నిండు జలాశయంలో ఉన్నాం.. నీళ్లు ఫుల్ గా ఉన్నాయనే భయం  లేదు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.. తెప్పల పైనుంచి దూకుతూ.. సినిమా సీన్ తలపించే విధంగా కొట్టుకున్నారు. మొత్తం నాలుగు తెప్పల్లో ఉన్న కుర్ర మత్స్యకారులు.. ఒకరిపై ఒకరు కర్రలు, తెడ్డు కర్రలతో దాడులు చేసుకుంటూ నది మధ్యలో బీభత్సం చేశారు. లింగాలగట్టు సమీపంలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావటంతో పోలీసులు కేసులు పెట్టారు. 

ALSO READ | చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం.. యువతిపై అడవి పందుల దాడి.. తీవ్ర గాయాలు..

శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  జలాశయం ముందు భాగంలో చేపలను పట్టే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇది కాస్తా దాడుల వరకు వెళ్లింది. తెప్పలపై చేపల వేట సాగిస్తున్న సమయంలో.. నది మధ్యలోనే.. తెప్పలు దూకుతూ.. తెడ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు.. కొట్టుకున్నారు. ఈ దాడుల్లో కొందరు మత్స్యకారులు గాయపడ్డారు. శ్రీశైలం గేట్లు మూసివేయటంతో.. జలాశయం దగ్గర చేపలు పట్టే సమయంలో ఈ ఘటన జరిగింది.  

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతోపాటు.. కృష్ణా నదిపై రెండు నెలలు చేపల వేటపై నిషేధం ఉంది. నిషఏధం సమయంలోనే లింగాలగట్టు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లటం.. దాడులు చేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సుండిపెంట సీఐ చంద్రబాబును వివరణ కోరగా.. వారు అంతా బంధువులే అని.. చిన్న చేప కోసం ఆవేశంలో ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవటం జరిగిందని అందరినీ పిలిపించి బైండోవర్ కేసు నమోదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు సీఐ చంద్రబాబు.