ICC Latest Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్‌లోనే బుమ్రా, జడేజా.. జైశ్వాల్, గిల్ వెనక్కి

ICC Latest Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్‌లోనే బుమ్రా, జడేజా.. జైశ్వాల్, గిల్ వెనక్కి

ఐసీసీ లేటెస్ట్ టెస్ట్ ర్యాంకింగ్స్ ను బుధవారం (జూలై 16) ప్రకటించింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్టుల్లో నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. సహచరుడు బ్రూక్ ను వెనక్కి నెట్టి 888 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. గత వారంలో నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న బ్రూక్ (867) మూడో స్థానానికి పడిపోయాడు. టీమిండియాపై ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన బ్రూక్.. టాప్ కు దూసుకొచ్చాడు. అయితే ఇటీవలే ముగిసిన లార్డ్స్ టెస్టులో 144 పరుగులు చేసిన రూట్ మళ్ళీ తన అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఈ టెస్ట్ రెండు ఇన్నింగ్స్ ల్లో బ్రూక్ విఫలం కావడం అతని ర్యాంక్ దిగజారింది. 

విలియంసన్ రెండో స్థానంలో.. స్మిత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు వెనకపడ్డారు. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 430 పరుగులు చేయడంతో ఒక్కసారిగా 15 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరిన గిల్.. మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి కేవలం 22 పరుగులే చేయడంతో తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఓపెనర్ జైశ్వాల్ కూడా మూడో టెస్టులో విఫలం కావడంతో నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు. లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న జడేజా 34వ ర్యాంక్ కు చేరుకోవడం విశేషం. 

బౌలింగ్ లో బుమ్రా టాప్ ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో 901 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ లో ఉన్నాడు. రెండో స్థానంలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబడా 851 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రాను మినహాయిస్తే భారత్, ఇంగ్లాండ్ జట్లలో ఎవరూ కూడా టాప్-10 లో స్థానం సంపాదించుకోలేకపోయారు. ఆల్ రౌండర్స్ విభాగంలో జడేజా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 

ALSO READ : IND vs ENG 2025: నువ్వు సూపర్ స్టార్ అయినా అలా చేయడానికి కుదరదు: బుమ్రాకు గవాస్కర్ వార్నింగ్