ఆదిలాబాద్ లో నిరుద్యోగులను నిండా ముంచిన మైక్రో ఫైనాన్స్.. రోడ్డున పడ్డ 500 మంది బాధితులు

ఆదిలాబాద్ లో నిరుద్యోగులను నిండా ముంచిన మైక్రో ఫైనాన్స్.. రోడ్డున పడ్డ 500 మంది బాధితులు

ఆదిలాబాద్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులే  టార్గెట్ గా మోసాలకు పాల్పడింది  ఓ సంస్థ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు కాజేసింది. డబ్బులు తీసుకుని మోహం చాటేయడంతో  బాధితులో ఆందోళనకు దిగారు. 

ఆదిలాబాద్ జిల్లాలో  ‌ డిజిటల్ మైక్రో పైనాన్స్ నిరుద్యోగులను నిండా ముంచింది.   ఉద్యొగాలు ఇస్తామంటూ  నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు సంస్థ నిర్వాహకులు.  ఒక్కోక్కరి నుంచి రూ.20 వేలు వసూలు చేసింది యాజమాన్యం.  ఇలా  500  మంది నుంచి  డబ్బులు వసూలు చేసి  బోర్డు తిప్పేసింది యాజమాన్యం. డబ్బులు తీసుకుని ఉద్యోగాలివ్వకుండా బోర్డు తిప్పేయడంతో బాధితులు  సంస్థ ముందు ఆందోళనకు దిగారు. 

ALSO READ : శ్రీశైలం జలాశయంలో తెప్పల్లోనే కొట్టుకున్న మత్స్యకారులు : సినిమా సీన్ చూపించిన కుర్రోళ్లు

తమకు న్యాయం చేయాలని డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు  కోరుతున్నారు.  మరోసారి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా సంస్థ నిర్వాహకులకు  కఠినంగా శిక్షించాలని  పోలీసులకు ఫిర్యాదు చేశారు.