కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తీరుతాం : ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తీరుతాం : ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల మున్సిపల్​కార్పొరేషన్​లో కాంగ్రెస్​అభ్యర్థులను గెలిచి తీరుతారని ఎమ్మెల్యే ప్రేంసాగర్​రావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్​ కార్పొరేషన్​కు సంబంధించిన 60 డివిజన్ల కార్పోరేటర్ అభ్యర్థుల జాబితాను శుక్రవారం మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేషన్​ను అభివృద్ధి చేసుకుంటామన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదేనని తెలిపారు. 2 వేల పడకల ఆస్పత్రి నిర్మాణమే తమ లక్ష్యమన్నారు. గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపల పెంపకం కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.