OTT Movies: ఈ వీకెండ్ (జూలై 16-20) ఓటీటీలోకి ఏకంగా 20కి పైగా సినిమాలు.. తెలుగులో 3 ఇంట్రెస్టింగ్..

OTT Movies: ఈ వీకెండ్ (జూలై 16-20) ఓటీటీలోకి ఏకంగా 20కి పైగా సినిమాలు.. తెలుగులో 3 ఇంట్రెస్టింగ్..

ప్రతివీకెండ్ లాగే.. ఈ వారం (జూలై16-20) కూడా ఆడియన్స్కు థ్రిల్ ఇచ్చే సినిమాలు అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం (జూలై 18న) థియేటర్లో కిరీటి, శ్రీలీల జంటగా నటించిన 'జూనియర్' మూవీ, రానా సమర్పిస్తున్న 'కొత్తపల్లిలో ఒకప్పుడు'తో పాటుగా 'పోలీస్ వారి హెచ్చరిక', సంత్ తుకారం' బయోపిక్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఈ క్రమంలోనే ఓటీటీలో 20కి పైగా సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్కి అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్రైమ్, హార్రర్, యాక్షన్ వంటి అన్నిరకాల జోనర్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఉన్నాయి.

ఇందులో తెలుగు బ్లాక్ బస్టర్స్ కుబేర, భైరవం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తోపాటు తెలుగు డబ్డ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరికొన్ని సినిమాలు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సబ్ టైటిల్స్తో స్ట్రీమ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయనేది ఓ లుక్కేద్దాం. 

అమెజాన్ ప్రైమ్:

ది సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 16

కుబేర (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ) - జూలై 18

ALSO READ : Varun-Lavanya: వెకేషన్లో వరుణ్-లావణ్య.. ఫోటోలు చూసి ముచ్చటపడుతున్న ఫ్యాన్స్

జీ5:

భైరవం (తెలుగు సినిమా) - జూలై 18

ద భూత్ని (హిందీ హారర్ కామెడీ) - జూలై 18

సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18

నెట్‌ఫ్లిక్స్:

అపాకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 14

ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ సీజన్ 1 (జపనీస్ ఎనిమీ సిరీస్) - జూలై 14

ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ సీజన్ 1 (జపనీస్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 14

ట్రేయిన్‌రెక్: బెలూన్ బాయ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- జూలై 15

వాంటెడ్ (ఇంగ్లీష్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్)- జూలై 16

ఎమీ బ్రాడ్‌లీ ఈజ్ మిస్సింగ్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ)- జూలై 16

అన్‌టామ్‌డ్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 17

కమ్యూనిటీ స్క్వాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 17

క్యాటలాగ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ ఫిల్మ్)- జూలై 17

వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 18

డెలిరియమ్ (ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూలై 18

ఆల్మోస్ట్ ఫ్యామిలీ (బ్రెజిలియన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18

వాల్ టు వాల్ (కొరియన్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్)- జూలై 18

ది కర్స్‌డ్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్)- జూలై 19

MX ప్లేయర్:

గుటర్ గూ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూలై 17

జియో హాట్‍‌స్టార్:

కోయిటల్, హీరో అండ్ బీస్ట్ (స్పానిష్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 15

స్పెషల్ OPS సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 18

స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18

ఆపిల్ ప్లస్ టీవీ:

సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ మ్యాజికల్ డ్రామా చిత్రం)- జూలై 18

లయన్స్ గేట్ ప్లే:

జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్) - జూలై 18

రీ మ్యాచ్ (సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్) - జూలై 18

టేక్ పాయింట్ (కొరియన్ యాక్షన్ థ్రిల్లర్) - జూలై 18

SUN NXT:

మనిదర్గల్ (తమిళ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ చిత్రం)- - జూలై 18

ఈ సినిమాలన్నీటిలో కుబేర, భైరవం, స్పెషల్ OPS సీజన్ 2 సినిమాలు తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మిగతా లిస్ట్ కూడా పర్లేదు. సత్తమమ్ నీదియుమ్, మునిదర్గల్, గుటర్ గూ సీజన్ 3, డెలిరియమ్, వాల్ టు వాల్, ది కర్స్‌డ్, ది భూత్ని, అన్‌టామ్‌డ్, వాంటెడ్ సినిమాలు  సైతం ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ఇక ఏ మాత్రం మిస్ అవ్వకుండా వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.