Rajinikanth: రజనీకాంత్ సింపుల్ లుక్ వైరల్.. 'కూలీ' రిలీజ్‌కు ముందు పోస్ గార్డెన్‌లో తలైవర్ సందడి!

Rajinikanth: రజనీకాంత్ సింపుల్ లుక్ వైరల్.. 'కూలీ' రిలీజ్‌కు ముందు పోస్ గార్డెన్‌లో తలైవర్ సందడి!

సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) నటించిన 'కూలీ' ( Coole ) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లతో గ్రాండ్ గా విడుదల కానుంది.  భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ మూవీ  కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రజినీకాంత్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధిలో రజనీకాంత్ సాధారణంగా నడుచుకుంటూ కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాంతం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు నివసించే అత్యంత విలాసవంతమైన ప్రదేశాలలో ఒకటి. రజనీకాంత్ పొరుగువారు తీసిన ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

రజనీకాంత్ నిరాడంబరత

ఈ ఫోటోలో  రజనీకాంత్  బూడిద రంగు షర్ట్, నేవీ బ్లూ షార్ట్స్, వాకింగ్ షూస్‌తో ఎంతో సాధారణంగా కనిపించారు.  ఒక యూజర్  తన  X  ఖాతాలో ఈ ఫోటోను షేర్ చేస్తూ, "తలైవర్ సాధారణ ఉదయపు నడకలో బాక్సర్ షార్ట్స్‌తో కనిపించారు. కోలీవుడ్‌లో మొదటిసారిగా రూ.1000 కోట్ల సినిమాను అందించడానికి కేవలం ఒక నెల మాత్రమే ఉందా?" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కామెంట్ సెక్షన్‌లో, రజనీకాంత్ నివసించే అదే పరిసరాల్లో నివసించే తన మామగారు ఈ చిత్రాన్ని తీసినట్లు యూజర్ ధృవీకరించారు. రజనీకాంత్ ఎప్పుడూ తన సింప్లిసిటీకి ప్రసిద్ధి. ఈ ఫోటో కూడా ఆయన నిజ జీవితంలోని నిరాడంబరతను ప్రతిబింబిస్తోందని నెటిజన్లు తమ అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా 'కూలీ' విడుదల
రజనీకాంత్ నటించిన చిత్రం 'కూలీ' (Coolie) విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు, ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అదే రోజున హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' (War 2) కూడా విడుదల కావడం విశేషం. రెండు భారీ చిత్రాల మధ్య ఈ పోటీ బాక్సాఫీస్ వద్ద ఉత్సాహాన్ని పెంచుతోంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ' చిత్రంలో నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ 'దాహా' అనే పాత్రలో పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో మెరవనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన 'కూలీ' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   ప్రస్తుతం రజనీ కాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న జైలర్ 2 షూటింగ్ నుండి విరామం తీసుకున్నారు. ఈ సీక్వెల్ మూవీని 2026 మొదటి అర్ధబాగంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది..