బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉంది : ఆజాద్ 

బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉంది : ఆజాద్ 

సరైన ప్రణాళికతో వెళ్తే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ అని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో ఆప్ విఫలమైందని, ఆ రాష్ట్ర ప్రజలు మళ్లీ ఆప్ కు ఓటు వేయరన్నారు. తాను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పటికీ లౌకికత్వం అనే కాంగ్రెస్ సిద్దాంతానికి వ్యతిరేకం కాదన్నారు.

గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబర్చాలని కోరుకుంటున్నట్లు ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 52 ఏళ్ల అనుబంధాన్ని విడిచిపెట్టిన ఆజాద్.. డెమొక్రటిక్ ఆజాద్ అనే పార్టీని స్థాపించారు. నవంబర్ 12న హిమాచల్ లో, డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 8 న వెలువడనున్నాయి.