రాముడి గుడి ప్రారంభం తర్వాత.. గోధ్రా తరహా ఘటన జరగొచ్చు

రాముడి గుడి ప్రారంభం తర్వాత.. గోధ్రా తరహా ఘటన జరగొచ్చు

ముంబై: యూపీలోని అయోధ్యలో రాముడి గుడి ప్రారంభం తర్వాత గోధ్రా తరహా హింసాత్మక ఘటన జరగొచ్చంటూ మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే సంచలన కామెంట్ చేశారు. సోమవారం మహారాష్ట్రలోని జల్ గావ్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రాముడి గుడి ప్రారంభం కానుంది.  ఈ వేడుకలకు బస్సుల్లో, ట్రక్కుల్లో పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, తిరుగు ప్రయాణంలో వాళ్లపై గోధ్రా తరహాలో దాడి జరగొచ్చు” అని ఉద్ధవ్ అన్నారు.

ALSO READ:పెండింగ్ ​పనులపై ఫోకస్! 

2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్ ప్రెస్​లో గుజరాత్​కు బయలుదేరిన కరసేవకుల రైలుకు గోధ్రా స్టేషన్ వద్ద దుండగులు నిప్పు పెట్టారు. చాలామంది కరసేవకులు సజీవ దహనయమయ్యారు. దీంతో రాష్ట్రమంతటా అల్లర్లు చెలరేగాయి. ఇప్పుడు కూడా ఇదే తరహా ఘటన జరిగే అవకాశం ఉందని ఉద్ధవ్ ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు ఆదర్శనీయులైన నేతలే లేరని, కానీ వారు సర్దార్ పటేల్, నేతాజీ వంటి వారిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారని ఉద్దవ్ విమర్శించారు. తన తండ్రి బాల్ థాక్రే వారసత్వాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవాలని చూస్తున్నారని అన్నారు.