రూ.72 వేలకు చేరిన బంగారం ధర

రూ.72 వేలకు చేరిన బంగారం ధర

న్యూఢిల్లీ: వరుసగా మూడో సెషన్‌‌లో బంగారం  వెండి ధరలు తాజా జీవితకాల గరిష్ట స్థాయిలను తాకాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర బుధవారం రూ.160 పెరిగి రూ. 72 వేలు దాటింది.  ఇది మంగళవారం రికార్డు స్థాయిలో 10 గ్రాములు రూ.71,840 వద్ద స్థిరపడింది. వెండి ధర రూ.200 పెరిగి రికార్డు స్థాయిలో కిలో రూ.84,700కి చేరింది. 

విదేశీ మార్కెట్లలో బుల్లిష్ ట్రెండ్ నేపథ్యంలో ఢిల్లీ మార్కెట్‌‌లో స్పాట్ గోల్డ్ ధరలు (24 క్యారెట్లు) 10 గ్రాములకు రూ.160 పెరిగి రూ.72,000 వద్ద ట్రేడవుతున్నాయని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్‌‌ ఎనలిస్టు ఒకరు తెలిపారు.