వృద్ధాప్య పింఛను 57ఏళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు

V6 Velugu Posted on Aug 04, 2021

వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్ ను 57 ఏళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్ ను తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఓల్డేజ్ పింఛన్ల అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకుంటుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ను బదిలీ చేయాలన్నారు.

Tagged Government Orders, reduce, old age pension, 57 years

Latest Videos

Subscribe Now

More News