సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ముందంజ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ముందంజ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు :  సామాజిక సేవ చేయడంలో లయన్స్​క్లబ్ ఎల్లప్పుడూ ముందుంజలో ఉంటుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్, సన్​రైజ్​హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. 

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో లయన్స్​క్లబ్​వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాస్, చీకోటి సంతోష్, గోగికారి శ్రీనివాస్, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.