
హైదరాబాద్, వెలుగు: బాసరలో ట్రిపుల్ ఐటీలో ఇద్దరి స్టూడెంట్ల మరణం బాధాకరమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ ఘటనలకు సంబంధించి 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీసీని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. స్టూడెంట్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని గవర్నర్ సూచించారు.