ఖేడ్ లో వైభవంగా కార్తీక దీపోత్సవం

ఖేడ్ లో వైభవంగా కార్తీక దీపోత్సవం

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ పట్టణంలో లలితా దేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం కార్తీక దీపోత్సవం, శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మి వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమన్నారు. 

చేసిన పాపాలు పోగొట్టుకోవడం, పునర్జన్మ రాకుండా చూసుకోవడం మానవుని ప్రధాన ధర్మం అన్నారు. కార్యక్రమంలో కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్, అంతర్గాం పీఠాధిపతి కరణ్ గజేంద్ర భారతి మహారాజ్, సత్యనారాయణ స్వామి ఆలయ వ్యవస్థాపకుడు చిన్ని మధుకర్, గుడి చంద్రశేఖర్, పలువురు అర్చకులు, నారాయణి షాపింగ్ మాల్ ప్రొప్రైటర్ అనంతం  బ్రదర్స్, గున్నాల నర్సింలు పాల్గొన్నారు.