
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్‌లో ఇంజినీరింగ్, నాన్ -ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లోమా అభ్యర్థుల కోసం అప్రెంటిస్‌షిప్ నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో సికింద్రాబాద్ జేబీఎస్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
రీజియన్ పరిధిలోని 11 డిపోల గ్యారేజీ, ఆపరేషన్, ఆఫీస్ విభాగాల్లో పని చేసేందుకు 2021 తర్వాత ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్), డిప్లోమా (మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్), నాన్- ఇంజినీరింగ్ (బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ) అభ్యర్థులు 3 సంవత్సరాల అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.