గ్రామాల అభివృద్ధికి కృషి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

గ్రామాల అభివృద్ధికి కృషి  : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

చిట్యాల, వెలుగు: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఅన్నారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో  ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ గ్రామసభలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్​ బి. చంద్రశేఖర్ తో  కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు, నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఊరుమడ్ల గ్రామాభివృద్ధికి ఇప్పటికే రూ. 2.5 కోట్లతో చెరువు పటిష్టత, రూ. 2 కోట్లతో బీటీ రోడ్ల పనులు చేపట్టామన్నారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ గత రెండేండ్లుగా ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి ప్రణాళికలో భాగంగా లబ్ధిదారుల వివరాల సేకరణ, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రైతులకు బోనస్ లాంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామంలోని ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని వీరు ప్రారంభించారు.