కోట్లు ఖరీదు చేసే హ్యాండ్​బ్యాగ్స్​

V6 Velugu Posted on Jul 25, 2021

సౌకర్యంగా, స్టైల్​గా ఉండే హ్యాండ్‌‌బ్యాగ్స్‌‌ ఇప్పుడు లగ్జరీ ఐటమ్స్‌‌గా మారిపోయాయి. సెలబ్రిటీల చేతుల్లో స్టేటస్‌‌కు సింబల్‌‌గా ఉంటున్నాయి. వేలు, లక్షలు కాదు. ఒక్కో హ్యాండ్‌‌బ్యాగ్‌‌ కోట్ల రూపాయల ధర పలుకుతోంది. వీటిలో చాలావరకు లగ్జరీ హ్యాండ్​బ్యాగ్స్​కి పేరొందిన ‘హెర్మెస్​’ కంపెనీ తయారుచేసినవే. మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన హ్యాండ్‌‌బ్యాగ్స్‌‌లో కొన్ని.
పర్వ మీ ధర 52 కోట్లు
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో అత్యంత ఖరీదైన హ్యాండ్‌‌బ్యాగ్‌‌ ఇదే. దీనిపేరు ‘పర్వ మీ’. లగ్జరీ హ్యాండ్​బ్యాగ్​లకు కేరాఫ్​ అయిన ‘బొవరినీ మిలనేసి’ అనే ఇటాలియన్​ కంపెనీ దీన్ని తయారుచేసింది. మెరుస్తున్న అలిగేటర్​ స్కిన్​ (మొసలి చర్మం) అలంకరణ​, ప్లాటినంతో రూపుదిద్దిన పది సీతాకోకచిలుకలు (వీటిలో నాలుగింటిని డైమండ్, మూడింటిని నీలమణి, పచ్చలు పొదిగి, మిగతా వాటిని నీలి, ఆకుపచ్చ రంగులు ఉన్న రాళ్లతో  తయారు చేశారు​), డైమండ్​ ఆకారంలోని క్లస్ప్​ ఈ బ్యాగ్​కి కొత్తదనం తెచ్చాయి. ప్లాస్టిక్​ వేస్ట్​ నుంచి  సముద్రాల్ని కాపాడాలనే అవేర్​నెస్​ కల్పించడం కోసం ఈ హ్యాండ్​బ్యాగ్​ని మార్కెట్లోకి తెచ్చారు.  
మౌవాడ్​ 1001నైట్స్​ డైమండ్ పర్స్​
28 కోట్లకు పైగా ధర పలికే ఈ హ్యాండ్​బ్యాగ్​ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్​పర్స్​ల్లో ఒకటి. విలువైన పర్స్​గా కిందటి ఏడాది గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కింది కూడా. హార్ట్ షేప్​లో ఉన్న ఈ పర్స్​ని 18 క్యారెట్ల బంగారం, 4,517 వజ్రాలతో తయారుచేశారు.   
హెర్మెస్​ కెల్లీ రోస్​ గోల్డ్ బ్యాగ్​
ఇది ప్రపంచంలోని లగ్జరీ బ్యాగుల్లో మూడోది. ఫ్రెంచ్​ ఫ్యాషన్​ డిజైనర్​ పియెర్రె హార్డీ ఈ బ్యాగ్​ని డిజైన్​ చేశాడు. రోస్​ గోల్డ్​ డాట్స్​ స్పష్టంగా కనిపించే ఈ బ్యాగ్​ని 1160 డైమండ్స్​తో తయారుచేశాడు. రోజ్​​గోల్డ్​ని క్రొకొడైల్ లెదర్​లా కనిపించేలా మలిచిన ఈ బ్యాగ్ ఖరీదు 14 కోట్ల 90 లక్షల పైనే. ​ 
బిర్కినీ బ్యాగ్
ఫ్యాషన్​ ప్రియుల్ని ఆకట్టుకుంటున్న బిర్కినీ బ్యాగ్ ధర10 కోట్ల మీదే. ఈ హ్యాండ్​బ్యాగ్ అవుటర్​ లేయర్​పై రెండు వేల వజ్రాల్ని పొదిగారు. బ్యాగు మధ్యలో ముత్యం సైజ్​లో ఉన్న8 క్యారెట్ల డైమండ్​ని దుస్తులకు ఆభరణంగా పిన్​ చేసుకోవచ్చు కూడా. అలాగే, వజ్రాలతో తయారుచేసిన హ్యాండ్​బ్యాగ్ స్ట్రాప్​ని బ్రేస్​లెట్, నెక్లెస్​గా పెట్టుకోవచ్చు. 

Tagged life style, crores, , Handbags

Latest Videos

Subscribe Now

More News