పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్రలు : జంగా గోపాల్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్రలు : జంగా గోపాల్ రెడ్డి

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా సైకిల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జంగా గోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర కొత్తకొండ జాతరకు చేరుకుని తిరిగి పబ్లిక్ గార్డెన్ వరకు సైకిల్ మారథాన్‌గా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయని, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్లాస్టిక్ రహిత సమాజం లక్ష్యంగా ప్లకార్డులతో సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సైకిల్ మారథాన్‌లో సంఘం సెక్రటరీ పులివెండ్ల అనంత్, జాయింట్ సెక్రటరీ పాక సత్యనారాయణ, సభ్యులు సుధాకర్ రెడ్డి, రాంబాబు, రవి, రాజు, చంద్రమౌళి, సుదర్శన్, చైతన్య గిరి తదితరులు పాల్గొన్నారు.