మద్యం ఆదాయంరెట్టింపు కోసమే కొత్త పాలసీ..అందుకే వైన్స్ దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంచారు : హరీశ్ రావు

మద్యం ఆదాయంరెట్టింపు కోసమే కొత్త పాలసీ..అందుకే వైన్స్ దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంచారు : హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తెచ్చారని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

  మద్యం షాపుల దరఖాస్తు ఫీజును ఏకంగా 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారని మండిపడ్డారు. రేవంత్ రెడ్ది.. ప్రజలకు మద్యం తాగించడం, ఖజానాను నింపుకోవడం అనే విధానాన్ని పాటిస్తున్నారని.. అందుకోసం అన్ని రకాల మద్యంపై ధరలు పెంచాడన్నారు.  మద్యం అమ్మకాలు పెరగాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.