మరో 900 ఐసీయూ బెడ్లు

మరో 900 ఐసీయూ బెడ్లు

గచ్చిబౌలి, వెలుగు: రాష్ట్రంలో రూ. 154 కోట్లతో మరో 900 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సౌకర్యాలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. గచ్చిబౌలి కొండాపూర్ లో గల జిల్లా ఆసుపత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన థర్డ్​ ఫ్లోర్​ను హరీశ్, మంత్రి సబితా రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ..  సీఎస్​ఐఆర్​లో భాగంగా మైండ్​స్పేస్​రహేజా కంపెనీ సహకారంతో100 బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. కొండాపూర్ ఆసుపత్రికి డయాలసిస్ యూనిట్ తెస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.154 కోట్లతో 900 ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.  ప్రతిరోజు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, టీకా వేయించుకోని వారు త్వరగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సీఎస్​సోమేశ్ కుమార్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు, రహేజా సంస్థ ప్రతినిధులు, డాక్టర్లు పాల్గొన్నారు.