తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. బండరాళ్లను తొలగిస్తున్న అధికారులు

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. బండరాళ్లను తొలగిస్తున్న అధికారులు

తిరుపతి, తిరుమలలో  నాలుగు రోజుల నుంచి ( అక్టోబర్ 19 నాటికి) ​ కురస్తున్న వర్షాలకు ఘాట్‌ రోడ్డులో  కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడటతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

తిరుమలలో ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్‌ రోడ్డులో  9 వ కిలోమీటర్​ కొండచరియలు విరిగిపడ్డాయి.  జారిపడిన కొండ చరియలను టిటిడి సిబ్బంది తొలగించారు. బండ రాళ్లు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది.  కొండ చరియలను  టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు.