భారీ వర్షాల ఎఫెక్ట్: రేపు రాష్ట్రవ్యాప్తంగా సెలవు

V6 Velugu Posted on Sep 27, 2021

  • సీఎం కేసీఆర్ ప్రకటన

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండడంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రేపు మంగళవారం సెలవుదినంగా ప్రకటించింది. అన్ని యాజమాన్యాలలోని విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సెలవు పాటించాని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వాళ్ల ఏర్పడ్డ పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో ఇవాళ సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసినందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం (28 .9 ..2021 )సెలవు ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం ఆదేశాలననుసరించి ఉత్తర్వులు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని చీఫ్ సెక్రెటరీ ఆదేశించారు.
 అయితే  అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు మాత్రం విధి నిర్వహణలో ఉండాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల వాల్ల ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సి.ఎస్. సోమేశ్ కుమార్ తెలియచేశారు. 

మరిన్ని వార్తల కోసం..

రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. పోలీసుల సూచనలివే

పాకిస్థాన్ జాతిపిత విగ్రహం పేల్చివేత

హుస్సేన్‌ సాగర్ గేట్లు ఓపెన్.. లోతట్టు ప్రాంతాలకు అలెర్ట్

Tagged CM KCR, KCR, Telangana CM, TS Govt, rains effect, , heavy rains in ts, gulab rains effect, cm kcr review gulab cyclone, kcr inquires, cm kcr respond, tuesday holiday, september 28th holiday

Latest Videos

Subscribe Now

More News