బాంబులతో పాకిస్థాన్ జాతిపిత విగ్రహం పేల్చివేత

బాంబులతో పాకిస్థాన్ జాతిపిత విగ్రహం పేల్చివేత

పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని బలోచ్‌ తీవ్రవాదులు బాంబులు పెట్టి పేల్చేశారు. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌‌ సిటీలో మెరైన్ డ్రైవ్‌ ఏరియాలో ఈ ఏడాది జూన్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని తీవ్రవాదులు బ్లాస్ట్ చేశారు. పేలుడులో జిన్నా విగ్రహం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ ఘటనకు బాధ్యులం తామేనంటూ పాకిస్థాన్ సర్కారు బ్యాన్ చేసిన మిలిటెంట్ సంస్థ బలోచ్ రిపబ్లికన్ ఆర్మీ ప్రకటించుకుంది. 

ఈ ఘటనపై దర్యాప్తుకు హైలెవల్ టీమ్‌ను నియమించినట్లు గ్వాదర్ డిప్యూటీ కమిషనర్ మేజర్ అబ్దుల్ కబీర్ ఖాన్ తెలిపారు. తీవ్రవాదులు మెరైన్ డ్రైవ్ ఏరియాకు టూరిస్టులుగా వచ్చి, ప్రాంతంలో బాంబులు పెట్టి పేలుళ్లకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ ఎవరీ అరెస్ట్ చేయలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, ఒకటి రెండ్రోజుల్లోనే దోషులను పట్టుకుంటామని చెప్పారు. 

పాకిస్థాన్ జాతిపిత అయిన జిన్నా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే పాకిస్థాన్ ఐడియాలజీపై దాడి చేయడమేనని బలోచిస్థాన్ మాజీ హోం మంత్రి, ప్రస్తుత ఎంపీ సర్ఫరాజ్ బుగ్తీ అన్నారు. దీనికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

భారత్‌ బంద్‌లో విషాదం.. నిరసనల్లో రైతు మృతి

రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. పోలీసుల సూచనలు