నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో జోరుగా వరి నాట్లు

నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో జోరుగా వరి నాట్లు
  • నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు: 

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో వర్షం కురుస్తుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నిజామాబాద్​ జిల్లాలో అత్యధికంగా డొంకేశ్వర్​లో 78.0 మి.మీ వర్షం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా రామారెడ్డి మండలంలో 54.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. పొలాలు తడువడంతో సాగు విస్తీర్ణం పెరుగనుంది. రెండు రోజుల నుంచి వరినాట్లు ఊపందుకున్నాయి. వర్షాధారంపై వేసిన పంటలు గట్టెక్కుతాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని ఇరు జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. 

లింగాపూర్ లో వాగులో పడిన ట్రాక్టర్​

ఇందల్వాయి మండలంలోని లింగాపూర్ వాగులో వరద నీరు ప్రవహిస్తోంది. బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా,  పక్కనే సిమెంట్​పైప్​లు వేశారు.  రైతు లక్ష్మయ్య ట్రాక్టర్​ను లింగాపూర్ వాగు దాటించేందుకు  ప్రయత్నించగా వాగులో పడింది. ఎస్సై సందీప్ వచ్చి వాగు మీదుగా వాహనాలు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాగు మీదుగా ధర్పల్లి వైపు వెళ్లే  వెహికల్స్​ను తిర్మన్​పల్లి, లోలం, ఎల్లారెడ్డిపల్లి మీదుగా డైవర్ట్ చేశారు. 

 కామారెడ్డి జిల్లాలో వర్షపాతం నమోదు ఇలా..  

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో అత్యధికంగా 54.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.  మాచారెడ్డి మండలం లచ్చాపేటలో  52.3, బొమ్మదేవునిపల్లిలో 42.0,  ఇసాయిపేటలో 41.8, మగ్ధంపూర్​లో 4‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.8,  బీర్కుర్​లో 38.3, ఎల్పుగొండలో 37,  కొల్లూర్​లో  34.3,  డొంగ్లిలో 32.8, కామారెడ్డిలో 30, సదాశివనగర్​లో 27.5, బీబీపేటలో 25.0, రాంలక్ష్మణ్​పల్లిలో 25, ఆర్గొండలో 25.0,  తాడ్వాయిలో 24.8, లింగంపేటలో 23, పుల్క్​లో 22.5,  బిచ్​కుందలో 22.0, సర్వాపూర్​లో 21.8, దోమకొండలో 20.8,  మెనూర్​లో 20.0, పిట్లంలో 20.0, పాతరాజంపేటలో 19.8, పెద్దకొడప్​గల్​లో 16.8,  భిక్కనూర్​లో 15.3,  జుక్కల్​లో 11 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

నిజామాబాద్​ జిల్లాలో వర్షపాతం నమోదు ఇలా.. 

డొంకేశ్వర్​లో అత్యధికంగా 78.0 మి.మీ వర్షం నమోదు కాగా, భీంగల్​లో 59.1, చందూర్ 58.2, మోస్రా 49.4, జక్రాన్​పల్లి 48.8, డిచ్​పల్లి 48.5 మీ.మీ, ఆలూర్​47.8, వర్ని 44.1, రెంజల్​ 41.2, నందిపేటలో కూడా 41.2 మీ.మీ, మాక్లూర్​ 40.6, ధర్పల్లిలో  40.0, కమ్మర్​పల్లి 40.2, ఆర్మూర్​ 39.6, ఎడపల్లి 39.7,  బాల్కొండ 39.2, ఇందల్వాయిలో 38.2, వేల్పూర్​ 37.6, బోధన్​ 36.6, సాలూరా 35.3, ముగ్బాల్​లో 34.5,  నిజామాబాద్​ నార్త్​ 33.9, నిజామాబాద్​ సౌత్​ 31.5, రుద్రూర్​ 32.9, నిజామాబాద్​ రూరల్​ 31.1, నవీపేట 37.6, మోర్తాడ్​ 29.3, సిరికొండ 28.8, ముప్కాల్​ 25.0, మెండోరా 17.9, పోతంగల్​ 16.8, ఎర్గెట్ల 15.1, కోటగిరి మండలంలో 6.7 మి.మీ వర్షం నమోదైంది.