ల్యాండ్ మార్పులతో డీపీఆర్ లేట్ చేసిన రాష్ట్రం

ల్యాండ్ మార్పులతో డీపీఆర్ లేట్ చేసిన రాష్ట్రం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆలస్యం చేసిందా? ఆరేండ్లు అవుతున్నా.. అవసరమైన భూమిని కేటాయించకపోవడం వల్లే యూనివర్సిటీ లేట్ అవుతోందా? అంటే ఆఫీసర్లు అవుననే చెప్తున్నారు. యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై రాష్ట్ర సర్కార్ కు ముందు స్పష్టత కరువైంది. ములుగు జిల్లాలో పెట్టాలని నిర్ణయించినా భూసేకరణ చేసి, దానిపై కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వడంలో ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర కేబినెట్​లో అప్రూవల్​కు ప్రపోజల్స్​ రెడీ కాలేదని, ఫండ్స్ రిలీజ్ కాలేదని ఆఫీసర్లు అంటున్నరు. ములుగులో సర్వే నెంబర్ 837లోని115 ఎకరాల భూమిని ఈ ఏడాది మార్చి 30న ఐటీడీఎ పీవోకు ములుగు ఆర్డీవో హ్యాండోవర్ చేశారు. జూన్ చివరలో హెచ్ఆర్డీ మినిస్ట్రీ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా శాఖకు సీఈఈ/పీఐబీ (ఖర్చు) అప్రూవల్​ను కోరుతూ రాష్ట్ర సర్కార్ లెటర్​ రాసింది. కానీ అప్పటికే 2021–22 బడ్జెట్ కేటాయింపులు పూర్తవడంతో ఈ ఏడాది ఎక్స్ పెండిచర్ కు కేంద్రం నుంచి అప్రూవల్ ఇచ్చేందుకు వీలులేకుండా పోయిందని తెలుస్తోంది. 

మార్పులతో డీపీఆర్ లేట్  
ట్రైబల్ వర్సిటీ కి భూ కేటాయింపులపై మొదట గవర్నమెంట్ వెకెంట్ ల్యాండ్ నుంచి169.35 ఎకరాలను కేటాయించింది. తర్వాత మరో115.09 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్​ను, ఎక్స్​పోజర్ స్టడీస్ కోసం 50 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్​ను ఇచ్చింది. ఫైనల్ గా 335.04 ఎకరాల భూమిని ట్రైబల్ వర్సిటీకి ఇచ్చారు. రూ.865 కోట్లతో డీపీఆర్​ రెడీ చేసినా.. మార్పుల వల్ల అదీ ఆలస్యమైంది. ఫారెస్ట్ ల్యాండ్ కు క్లియరెన్స్​కూడా త్వరగా తెప్పించలేకపోయారు. వెకెంట్ ల్యాండ్​ను హ్యాండోవర్ చేయడంలోనూ ఆలస్యం చేశారు. డీపీఆర్​పై కేంద్రం నీతి ఆయోగ్ రిపోర్ట్​ను కోరింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీకి 2017లోనే కేంద్రం ‌‌‌‌‌‌ఆమోదం తెలిపింది.హెచ్ఆర్డీ మినిస్ర్టీ జాయింట్ సెక్రటరీ, యూజీసీ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ వీసీ, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ ఆధ్వ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. స్థలాన్ని కేంద్ర బృందం 2018లో ములుగులో పర్యటించి.. క్లాసుల కోసం కట్టిన టెంపరరీ బిల్డింగులకు ఓకే చెప్పింది. 
  
కేంద్రంపై సాకులు 
ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లో తాత్కాలిక ట్రైబల్​యూనివర్సిటీని ఏర్పాటుచేసి 2019 అకడమిక్ ఇయర్ నుంచే క్లాసులు స్టార్ట్ చేయాలని ముందు భావించారు. రూ.3 కోట్లు రిలీజ్ చేశారు. అడ్మిషన్ల బాధ్యతను హెచ్​సీయూకు అప్పగించారు. కానీ అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుడు జూన్​లో  కరోనాతో అకడమిక్ ఇయర్ ప్రారంభమే గందరగోళంలో పడింది. ఈసారి కూడా నోటిఫికేషన్ జారీ కాలేదు. దీనిపై కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చించాల్సిన రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందని ఆఫీసర్లు చెప్తున్నరు. ట్రైబల్ వర్సిటీకి కేంద్రం అప్రూవల్ ఇవ్వడం లేదని చెప్పుకుంటూ రాజకీయంగా రాష్ట్ర సర్కార్​పబ్బం గడుపుకుంటోందన్న విమర్శలు.