
అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఇందులోని సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పాడు. వికాస్ బాడిశ కంపోజ్ చేసిన పాటకు విరించి పుట్ల లిరిక్స్ రాశారు. యశస్వి కొండేపూడి, యాజిన్ నిజార్ కలిసి పాడారు. ‘మెమోరీస్ మెమోరీస్.. మెమోరీస్ ఆర్ పెయిన్‌ఫుల్..’ అంటూ సాగే పాటలో అశ్విన్, నందిత కెమిస్ట్రీ బాగుంది. శ్రీనివాస రెడ్డి, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.