
- ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాల వద్ద ఎక్కువ సౌండ్ ఉండే మైక్‌లు ఏర్పాటు చేయొద్దని నిర్వాహకులకు హైకోర్టు సూచించింది. అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదే అని స్పష్టం చేసింది. ఎక్కువ సౌండ్‌తో చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు చనిపోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేసింది. పవర్ సప్లై కాకపోతే విద్యుత్ శాఖ హెల్ప్ తీసుకోవాలని సూచించింది.
తన ఇంటి వద్ద అనుమతి లేకుండా గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేశారంటూ సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన 80 ఏండ్ల ప్రభావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఆమె అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే అనుమతులివ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కూడా రోడ్డుకు అడ్డంగా, గేటు తీయడానికి వీల్లేకుండా మండపం ఏర్పాటు చేశారంటూ ఆమె ధిక్కరణ పిటిషన్ వేశారు. వీటిని జస్టిస్ ఎన్‌వీ.శ్రావణ్‌కుమార్ మంగళవారం విచారించారు. పండగ ఆహ్లాదక వాతావరణంలో జరగాలని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా జరుపుకోవాలని అన్నారు. ఈ మేరకు గైడ్‌లైన్స్ జారీ చేశారు.