సబ్-రిజిస్ట్రార్ శ్రీలతను విచారించండి : హైకోర్టు

సబ్-రిజిస్ట్రార్ శ్రీలతను విచారించండి : హైకోర్టు
  • అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సిరాస్తి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్టు సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ సబ్-రిజిస్ట్రార్ శ్రీలతపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ సుదర్శన్, జులై 7న శ్రీలతపై లంచం ఆరోపణలతో రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సబ్-రిజిస్ట్రార్ శ్రీలత రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్టు, దీనికి అంగీకరించి డాక్యుమెంట్ రైటర్ సుబ్బారావు ద్వారా మొదట రూ.5 లక్షలు చెల్లించినట్లు సుదర్శన్ కోర్టులో చెప్పాడు. 

అలాగే, మరో ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం చంపాపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే, అక్కడ కూడా రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశారని సుదర్శన్ పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సివిల్ వ్యవహారమని చెప్పి ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ సుదర్శన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు సోమవారం విచారించింది.