మెటల్ షేర్లపై ఓ కన్నేయండి : సంజీవ్ భాసిన్

మెటల్ షేర్లపై ఓ కన్నేయండి : సంజీవ్ భాసిన్
  • హిందాల్కో, టాటా స్టీల్‌‌‌‌, జిందాల్‌‌‌‌ స్టీల్‌‌‌‌, జేఎస్‌‌‌‌డబ్ల్యూ 
  • షేర్లను రికమండ్ చేసిన సంజీవ్ భాసిన్

న్యూఢిల్లీ : సీనియర్ ఇన్వెస్టర్, ఐఐఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ సెక్యూరిటీస్  డైరెక్టర్ సంజీవ్ భాసిన్‌‌‌‌ మెటల్‌‌‌‌ షేర్లపై పాజిటివ్‌‌‌‌గా ఉన్నారు. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని షేర్లపై బుల్లిష్‌‌‌‌గా ఉన్నానని, ఈ షేర్లు పడే కొద్దీ కొనుగోలు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ‘మెటల్స్‌‌‌‌కు  డాలర్ వాల్యూతో లింక్ ఎక్కువ. డాలర్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ 104 నుంచి 99 కి పడడం చూశాం. చైనాలో సమస్యల వలన ఇన్వెస్టర్లు సైడ్‌‌‌‌లైన్‌‌‌‌లో ఉంటున్నారు. కానీ, ఇదొక  అవకాశం. గత మూడేళ్లు వరంగా మారాయి. స్టీల్ కంపెనీల బ్యాలెన్స్‌‌‌‌ షీట్‌‌‌‌లో అప్పులు తగ్గాయి.  స్టీల్ షేర్లు వాల్యూ స్టాక్స్ కంటే  గ్రోత్ స్టాక్స్‌‌‌‌గా మారాయి. వీటి మొత్తం ఫండమెంటల్స్ మారాయి. స్టీల్ షేర్లపై బుల్లిష్‌‌‌‌గా ఉన్నాను. ఈ షేర్లు పడితే కొనుక్కోండి. లేదా మెటల్‌‌‌‌ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌లో డబ్బులు పెట్టండి. డాలర్ పెరగడం ఆగుతుంది. గోల్డ్‌‌‌‌, డాలర్ రెండూ ఒకేసారి పెరగకూడదు. ఫెడ్ ఇప్పటికే తన క్రెడిబిలిటీ కోల్పోయింది.  ఇంకో రెండు రోజుల్లో మార్కెట్ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మెటల్ షేర్లు ర్యాలీలో ముందుంటాయి. హిందాల్కో, టాటా స్టీల్‌‌‌‌, జిందాల్‌‌‌‌ స్టీల్‌‌‌‌, జేఎస్‌‌‌‌డబ్ల్యూ షేర్లు ప్రస్తుత ధర దగ్గర బాగున్నాయి’ అని సంజీవ్ భాసిన్ వివరించారు. దేవయాని ఇంటర్నేషనల్‌‌‌‌ పై కూడా బుల్లిష్‌‌‌‌గా ఉన్నానని చెప్పారు.