రివ్యూ :'హిట్ 2'

రివ్యూ :'హిట్ 2'

మేజర్ మూవీ తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన సినిమా హిట్ 2. హిట్1 కి సీక్వెల్ గా.. మరొక ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ తో శైలేజ్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ లు ఇంట్రస్టింగ్ గా ఉండటం... ఇక హిట్ 2 మూవీని తన సొంత బ్యానర్ పై హీరో నాని తీయడంతో... ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత హైప్ క్రేయేట్ అయిది. అయితే ఈరోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా లేదా అన్నది ఓసారి చూద్దాం.

తెలుగులో ఫ్రాంచైజీ మూవీలు అరుదు. కానీ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ తో ఓ యూనివర్స్ నే క్రియేట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. విశ్వక్ సేన్ తో తీసిన హిట్ బ్లాక్ బాస్టర్ అవ్వడంతో... అడవి శేష్ ని హీరోగా పెట్టి ఇప్పుడు హిట్ 2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్షణం, గూఢాచారీ, ఎవరు, మేజర్ వంటి మూవీస్ లో హీరోగా నటించడంతో పాటు రచయితగాను తన టాలెంట్ ని చాటుకోవడం, హీరోనాని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండంతో ప్రేక్షకుల్లో హైప్ బాగా పెరిగిపోయింది. ఎంతో ఆసక్తిగా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల్ని రెండు గంటలపాటు థియేటర్ లో కూర్చోబెట్టగల్గినా... ప్రేక్షకులకి మాత్రం నిరాశ తప్పలేదు. ప్రతీ ప్రేక్షకుడు.... హిట్ ది సెకండ్ కేస్ లో ఏదో మిస్సయిందనే ఫీలింగ్ తోనే బయటికొస్తారు.

క్రిష్ణ దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్ ) ఓ ఐపీఎస్ ఆఫీసర్. వైజాగ్ లో ఎస్పీగా పనిచేస్తున్న కేడీ... క్రిమినల్స్ వి కోడి బుర్రలు, వారిని పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదంటూ తేలిగ్గా తీసీపారేస్తుంటాడు. ఇంతలోనే ఒక పబ్ లో మర్డర్ జరుగుతుంది. ఎంక్వైరీలో ఆ బాడీ ఒక అమ్మాయిది కాదు... తల, మొండెం, కాళ్లు, చేతులు ఇలా నలుగురమ్మాయిల పార్ట్స్ అని తెలుస్తుంది. కిల్లర్ వాళ్లని ఎందుకు చంపాడు? ఆ కిల్లర్ ని కేడీ ఎలా కనిపెట్టాడన్నదే ఈ సినిమా స్టోరీ.

హిట్ లో విశ్వక్ సేన్  తో పోలిస్తే... ఇందులో అడివి శేష్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తాడు. అందరు పోలీస్ ఆఫీసర్ లా కాకుండా కొంచెం నిర్లక్ష్య ధోరణితో.. యాటిట్యూడ్ తో కనిపించే క్యారెక్టర్లో శేష్ చక్కగా నటించాడు. శేష్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. క్లైమాక్స్ లోను తన యాక్టింగ్ తో మరింత కట్టిపడేస్తాడు. శేష్ కి జోడిగా నటించిన మీనాక్షి చౌదరి పర్లేదు అనిపిస్తుంది. రావు రమేష్, కోమిల ప్రసాద్, తనికెళ్ల భరణి, సుహాస్ లు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు. జాన్ స్టీవర్ట్ ఏడూ బీజీఎమ్ బాగుంది. థ్రిల్లర్ మూవీస్ ని ఓ లైన్ లో తీసుకెళ్లడంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు మణికందన్ కెమెరా వర్క్ కీలక పాత్ర పోషించాయి. సినిమాలో ఉన్న ఒక్క పాట బాగుంది. ఇక మూవీ నిర్మాణం నాని, ప్రశాంతిలు ఎక్కడ రాజీ పడలేదనిపిస్తోంది.

అయితే ఏ మూవీకి అయిన విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటే... హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది. ఈ స్టోరీలో క్లైమాక్స్ వరకు విలర్ ఎవరో తెలీదు. తెలిసాక ఇతనా అన్న ఫీలింగ్ వస్తోంది. కిల్లర్ అంటే అలా ఇలా ఉండాలన్న రూల్ ఏమి లేకపోయినా... ఉన్న ఆ క్యారక్టెర్ అయిన అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. హత్యలు చేయడం వెనుక ఉన్న కారణం అంత బలంగా ఉండదు. అందులో పెద్దగా లాజిక్స్ కూడా ఏమి కనిపించవు. హత్యల వనెకాల ఉన్న కారణాలని ఇంకాస్త బలంగా, కన్విన్సింగ్ గా చూపించి ఉంటే బాగుండేదేమో. రైటర్ కమ్ డైరెక్టర్ శైలేష్ కొలను క్రైమ్ థ్రిల్లర్లు తీయడంలో తన నైపుణ్యాన్ని చూపించినా... ఫస్ట్ మూవీ హిట్ లాగా ఈసారి అతను ప్రేక్షకులని ఎక్కువగా ఆశ్చర్యపర్చలేకపోయాడు. తన మీద పెరిగిన అంచనాలను శైలేష్ అందుకోలేకపోయాడు. కాస్టింగ్, స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డా బాగుండేదేమో అనిపిస్తోంది. ఇక మూడో కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చే ఆఫీసర్ అర్జున్ సర్కార్ ని ఎండింగ్ లో చూపిండం విశేషం. అతడడెవరన్నది మాత్రం తెరపై చూడాల్సిందే.