
భైంసా, వెలుగు: బిల్డింగ్ రెంట్ కట్టకపోవడంతో స్టూడెంట్లు లోపల ఉండగానే ప్రైవేట్ స్కూల్హాస్టల్కు ఓనర్ తాళం వేశాడు. భైంసాలోని వాసవి గురుకులం స్కూల్ యాజమాన్యం రెంట్ చెల్లించలేదంటూభవన యజమాని ఆదివారం రాత్రి 8 గంటలకు హాస్టల్‌కు తాళం వేశాడు. హాస్టల్లో దాదాపు 70 మంది చిక్కుకోగా అందులో 25 మంది టెన్త్ స్టూడెంట్లు ఉన్నారు. తెల్లారితే పరీక్ష ఉండడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. స్కూల్ యాజమాన్యం నాలుగు నెలల అద్దె రూ. 85 వేల వరకు చెల్లించాల్సి ఉందని, డబ్బులు కడితేనే తాళం తీస్తానని ఓనర్ చెప్పాడు. టీచర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. తాళం వేసిన విషయాన్ని స్టూడెంట్లు పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఎంఈవో బిల్డింగ్ ఓనర్‌తో చర్చించారు. అద్దె చెల్లించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాత్రి 10.30 గంటల సమయంలో తాళం తీశాడు.