అలాంటి ఇలాంటి ఫోన్ కాదు.. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్.. చూస్తే నమ్మలేరు..

అలాంటి  ఇలాంటి ఫోన్ కాదు.. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్.. చూస్తే నమ్మలేరు..

మీరు ఇంతకు ముందు ఫోల్డబుల్ ఫోన్‌ని చూసి ఉండవచ్చు, దాన్ని వాడి ఉండోవచ్చు. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ అయిన హువావే మేట్ XT ఫోన్ మిమ్మల్ని  నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఇది మీకు పైకి స్మార్ట్‌ఫోన్ లాగా కనిపించే అలంటి ఇలాంటి ఫోన్ కాదు. 

 6.4-అంగుళాల మెయిన్ స్క్రీన్ తో దాన్ని తెరిచినప్పుడు మరో పెద్ద డబుల్ స్క్రీన్ ఉంటుంది. దీనిని పూర్తిగా మడత పెట్టినపుడు కొంచెం మందంగా అనిపిపించిన మీ జేబులో సరిపోయేల ఉంటుంది. అయితే మీరు ఫోన్‌ను తెరిచి దాన్ని మళ్ళీ తెరిచినప్పుడు మూడు మడతల   ఫోన్ అవుతుంది. ఇదొక టాబ్లెట్ ఫోన్ కంటే మించి ఉంటుంది. 

మీరు ఇంతకుముందు ఇలాంటి ఫోన్‌ ఎప్పుడూ చూసి ఉండరు.  ఇంకా ఫోన్ని మడత పెట్టినపుడు దీని స్క్రీన్ పగలడం గురించి భయపడాల్సిన పని లేదు, వాడడానికి  చాలా అద్భుతంగా ఉంటుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 7 లేదా ఇతర బుక్-స్టైల్ ఫోన్ లాగా కాకుండా మేట్ XT పూర్తిగా కొత్త స్టయిల్లో తెరుచుకుంటుంది. ఇంకా ఫోన్ మూసినప్పుడు మూడు స్క్రీన్లు అయస్కాంతంల కలిసిపోతాయి.  

ఈ ఫోన్ ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్ కంటే మందంగా ఉంటుంది, కానీ 10-అంగుళాల టాబ్లెట్‌తో పోలిస్తే ఆకట్టుకునేలా సన్నగా, తేలికగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఐఫోన్ లేదా ఇతర స్మార్ట్‌ఫోన్ నుండి వేరు చేసే అకార్డియన్ లాంటి డిజైన్‌ని మీరు చూడవచ్చు. డిస్ ప్లే చూస్తే ఇతర ఫోల్డబుల్స్ లాగానే స్క్రీన్‌కి చిన్న మడతలు ఉన్నాయి. 

అయితే మేట్ XT ఓపెన్ చేసినపుడు ఒక చేతితో వాడే ఫోన్ కాదు, రెండు చేతులతో ఫోన్‌ను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ లోపలి స్క్రీన్ 10.2 అంగుళాలతో ఉంటుంది. ఇది ఒక మినీ టాబ్లెట్ మాత్రమే కాదు, మీరు ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లగల ఫుల్ లెవెల్ టాబ్లెట్. దీన్ని బ్లూటూత్ మౌస్, కీబోర్డ్‌తో కూడా కనెక్ట్ చేయొచ్చు ఇంకా కంప్యూటర్‌ల ఉపయోగించొచ్చు.  

చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్టాండర్డ్ గా ఉండే గూగుల్ మొబైల్ సర్వీసెస్ మేట్ XTలో ఉండదు. అంటే ప్లే స్టోర్ లేదా Gmail ఇంకా  డాక్స్ వంటి Google యాప్‌లు ఉండకపోవచ్చు. ఈ ఫోన్ HarmonyOS పై నడుస్తుంది, కాబట్టి Android యాప్‌లకు సపోర్ట్ ఉండకపోవచ్చు. చైనీస్ ప్రజలకు Mate XT అనేది తిరుగులేని స్మార్ట్‌ఫోన్ దాని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు.

దీని స్పెసిఫికేషన్లు  చూస్తే మేట్ XTలో కిరిన్ 9010 ప్రాసెసర్ ఉంది, ఇది హువావే రూపొందించిన కస్టమ్ చిప్. ఈ ఫోన్ 16GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ముఖ్యంగా దీని బ్యాటరీ ఎంతకాలం ఉంటుంది అనేది స్పష్టంగా తెలీదు కానీ 5,600 mAh బ్యాటరీ ఉండొచ్చు. అయితే, ప్రస్తుతానికి హువావే మేట్ XT అనేది ఒక ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్, సింపుల్ గా చెప్పాలంటే ఇదోగా ఫుల్ లగ్జరీ ఫోన్.  చైనా కాకుండా  ఇతర దేశాల్లో దీని ధర $4088 అంటే రూ.3 లక్షల 56 వేలు  ఉండే అవకాశం ఉంది.