మహాత్మా జ్యోతిభా పూలే స్కూల్ విద్యార్థులకు అస్వస్థత..

మహాత్మా జ్యోతిభా పూలే స్కూల్ విద్యార్థులకు అస్వస్థత..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని మహాత్మా జ్యోతిభా పూలే పాఠశాలలో శ్వాస ఇబ్బందులతో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సమస్యతో ఓ విద్యార్థిని కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను చూసి మరో విద్యార్థిని  కిందపడిపోయింది. ఆందోళనతో మరో ఇద్దరు విద్యార్థినులకు ఆయాసం ఏర్పడింది. ఇంకొక విద్యార్థినికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో..వారందరిని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  

ALSO READ:  108 వాహనంలో గర్భిణికి ప్రసవం.. ఆపద్బాంధవులుగా మారిన సిబ్బంది

ఆరుగురు విద్యార్థినుల్లో 10 వ తరగతి చదువుతున్న శరణ్య అనే విద్యార్థిని ఆమె తల్లిదండ్రులు  వరంగల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థినిలకు హఠాత్తుగా ఈ  ఆరోగ్య సమస్యలు ఎందుకు తలెత్తాయో వైద్యులు చెప్పలేకపోతున్నారు.