హైదరాబాద్ క్రికెట్ ఎన్నికలు..పోటీ పడే అభ్యర్థులు వీరే

హైదరాబాద్ క్రికెట్ ఎన్నికలు..పోటీ పడే అభ్యర్థులు వీరే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆరు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఈ జాబితాను ఎన్నికల అధికారి వి సంపత్ కుమార్ విడుదల చేశారు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత అభ్యర్థుల తుది జాబితా వెలువడింది. 

HCA ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నలుగురు వ్యక్తులు పోటీలో నిలిచారు. ఏ. జగన్ మోహన్ రావు, అమర్ నాథ్, డాక్టర్ కే అనిల్ కుమార్, పీఎల్ శ్రీనివాసన్ అధ్యక్ష బరిలో ఉన్నారు. ఉపాధ్యక్ష పదవికి మరో నలుగురు పోటీ పడుతున్నారు. సి బాబురావు, జీ శ్రీనివాసరావు, పీ శ్రీధర్, సర్ధార్ దల్దీత్ సింగ్ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. 

కార్యదర్శి పదవికి ఆర్ దేవరాజ్, ఆర్ హరినారాయణరావు, ఆర్ఎం భాస్కర్, వి ఆగంరావు పోటీలో ఉన్నారు. జాయింట్ సెక్రటరీ పదవికి చిట్టి శ్రీధర్, నోయల్ డేవిడ్, సతీష్ చంద్ర శ్రీవాస్తవ, టీ బసవరాజు పోటీ పడనున్నారు. 

Also Read :- పాక్ స్టార్ ప్లేయర్లకు జ్వరం: ఆసీస్‌తో మ్యాచ్ ఆడతారా..?

కోశాధికారి పదవికి CJ శ్రీనివాసరావు, సీ సంజీవ్ రెడ్డి, గెరార్డ్ కార్, పీ మహేంద్ర పోటీ చేయబోతున్నారు. కౌన్సిలర్ పోస్టులకు  డీఏజే వాల్టర్, డాక్టర్ అన్సార్ అహ్మద్ ఖాన్, సునీల్ కుమార్, వినోద్ కుమార్ ఇంగ్లే బరిలో నిలిచారు. 

అక్టోబర్ 20వ తేదీన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 149 క్లబ్ లు, సంస్థలు, 9 జిల్లా సంఘాలు, 15 మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఓటు వేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం.