వానాకాలం తిప్పలు తప్పేలా.. మాన్​సూన్​ యాక్షన్​ ప్లాన్..భారీ వానలు ఉండడంతో ముందుగానే జీహెచ్ఎంసీ అలర్ట్

వానాకాలం తిప్పలు తప్పేలా.. మాన్​సూన్​ యాక్షన్​ ప్లాన్..భారీ వానలు ఉండడంతో ముందుగానే జీహెచ్ఎంసీ అలర్ట్
  •  కొనసాగుతున్న నాలాల పూడికతీత  
  • పురాతన, శిథిలావస్థ బిల్డింగులను ఖాళీ చేయించాలని ఆర్డర్స్​ 
  •  వచ్చే నెలలో సెల్లార్ల తవ్వకాలు చేపట్టొద్దని ఆదేశాలు  
  •  ఒక్కో వార్డుకు మూడు మాన్​సూన్ ​ఎమర్జెన్సీ టీమ్స్.

హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే సీజన్​లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మాన్​సూన్​యాక్షన్ ప్లాన్ పై బల్దియా ముందస్తుగానే అలర్ట్ అయ్యింది. ఇప్పటికే నాలాల్లో పూడికతీత మొదలుపెట్టి కొనసాగిస్తోంది. అలాగే వానాకాలంలో సెల్లార్ల తవ్వకాలు బంద్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో వార్డుకు మూడు మాన్​సూన్​ఎమర్జెన్సీ టీమ్స్ చొప్పున 150 డివిజన్లకు 450 బృందాలను అందుబాటులో ఉంచనున్నది. వర్షాలు పడిన వెంటనే అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ టీమ్స్ క్లియర్ చేయనున్నాయి. 

రూ.55 కోట్లతో నాలాల పూడికతీత

నాలాల పూడికతీత పనులకు సంబంధించి గత బీఆర్ఎస్​హయాంలో అక్రమాలు జరిగాయి. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నాలాల పూడికతీత పనులపై సీరియస్​గా ఫోకస్ పెట్టారు. రూ.55 కోట్లతో ఈ పనులు చేపడుతున్నారు. పూడికతీత విషయంలో అవినీతి, అక్రమాలు జరిగితే స్థానిక సర్కిల్ ఇంజినీర్లనే బాధ్యులను చేశారు.  

పురాతన భవనాల గుర్తింపు

నగరంలో వానాకాలం పురాతన భవనాలు కూలే అవకాశం ఉండడంతో ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే మొదలుపెట్టింది. వర్షాల జోరు పెరగకముందే శిథిల భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాలకు నోటీసులు ఇచ్చి కూల్చివేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం లేదా సీజ్​చేయడం, రిపేర్లే అవసరం అయితే అది కూడా తొందరగా చేసుకునేలా యజమానులపై ఒత్తిడి తేనున్నారు. ఇప్పటికే ప్రతి సర్కిల్ కు సంబంధించి ఎన్నెన్ని పురాతన కట్టడాలు ఉన్నాయో చెప్పాలంటూ కమిషనర్​ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

ఒకవేళ శిథిలావస్థలో సర్కారు బడులు ఉన్నట్టయితే విద్యా శాఖ అధికారులకు తెలియజేయనున్నారు.  ప్రతి బిల్డింగ్​వివరాలను గూగుల్ స్ప్రెడ్ షీట్‌‌లో అప్‌‌డేట్ చేయడంతోపాటు రిపోర్టును బల్దియా హెడ్  ఆఫీసులో అందజేయనున్నారు. గతేడాది గ్రేటర్ లో 566 పురాతన, శిథిల భవనాలను బల్దియా గుర్తించింది. ఇందులో 89 భవనాలు పూర్తిగా పాడైపోవడంతో వాటిని అధికారులు కూల్చివేశారు. 

 హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణం

గ్రేటర్ లో 50 చోట్ల రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు నిర్మించాలని బల్దియా నిర్ణయించగా, మొదటి ఫేజ్ లో 12 చోట్ల పనులు మొదలు పెట్టారు. రాజ్ భవర్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వద్ద రెండు, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు ముందు రెండు, సచివాలయం సమీపంలో మరొకటి అందుబాటులోకి వచ్చాయి. రాజ్ భవన్ రోడ్డులో గతంలో 5 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వాన పడితే వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. కానీ కొద్ది రోజుల కింద  9 సెంటిమీటర్లు వాన పడినా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద  రోడ్డుపై నడుము లోతు నీరు చేరేది. ఇక్కడ హోల్డింగ్​ స్ట్రక్చర్ అందుబాటులోకి రావడంతో  వచ్చే వర్షాకాలం పెద్దగా ఇబ్బంది ఉండదని బల్దియా చెప్తోంది. ఎల్బీనగర్ లో 2, శేరిలింగంపల్లి లో 2, రాజేంద్రనగర్ లో ఒక హోల్డింగ్​స్ట్రక్చర్​నిర్మాణాలు కొనసాగుతున్నాయి వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేయనున్నారు. మరో రెండు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.